తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి నటుడు గా గుర్తింపు తెచ్చుకున్న
శ్రీకాంత్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రల్లో ... విలన్ పాత్రలలో నటించిన
శ్రీకాంత్ ఆ తర్వాత సినిమాల్లో హీరోగా అవకాశాలను దక్కించుకున్నాడు. అందులో భాగంగా
శ్రీకాంత్ హీరో గా నటించిన ఎన్నో సినిమాలు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో చాలా సంవత్సరాల పాటు
శ్రీకాంత్ తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరోగా కెరియర్ ను కొనసాగించాడు.
ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం
శ్రీకాంత్ హీరో గా నటించిన సినిమాలు చాలా వరకు
బాక్స్ ఆఫీస్ దగ్గర అపజాయలు చెందుతూ ఉండడంతో
శ్రీకాంత్ ప్రస్తుతం సినిమాల్లో
హీరో పాత్రల్లో మాత్రమే కాకుండా విలన్ పాత్రలలో ... ఇతర ముఖ్య పాత్రలలో కూడా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా కొంత కాలం క్రితమే
బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ
మూవీ లో
శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే సరైనోడు సినిమాలో
అల్లు అర్జున్ కు బాబాయ్ పాత్రలో నటించి తన నటనతో మెప్పించాడు.