టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మొదటగా మనం అనే సినిమా ద్వారా ఒక చిన్న పాత్రలో కనిపించింది హీరోయిన్ రాశిఖన్నా. దాని అనంతరం ఊహలు చూసి లాడే సినిమా ద్వారా మొదటిసారిగా హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది ఈమె .ఆ సినిమాలో తన నటనతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. గతంలో ఆమె నటించిన సినిమాలలో కాస్త లావుగా కనిపించి అందరినీ ఆకట్టుకుంది ఈమె. ప్రస్తుతం ఏమి టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా సినిమాలో వెబ్ సిరీస్ లో నటిస్తూ బిజీగా ఉంది .తెలుగు హిందీ తో పాటు మలయాళ తమిళ సినిమాల్లో కూడా వరుసగా నటిస్తూ బిజీ బిజీగా మారిపోయింది రాసి కన్నా.
అయితే తాజాగా రాశిఖన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టడం జరిగింది. ఆమె నటించిన మద్రాసు కేఫ్ సినిమా అయిపోయిన తర్వాత రాజమౌళి బాహుబలి సినిమా కోసం ఆడిషన్స్ ని నిర్వహించాలని తెలుసుకున్న ఆమె ...తమన్నా నటించిన అవంతిక పాత్ర కోసం ఆడిషన్ జరుగుతున్న సమయంలో ఆ రోజు కోసం మొదటగా తమన్న కంటే ముందే రాసి కన్నాను పిలవడం జరిగింది. అనంతరం ఆడిషన్స్ కు వెళ్ళిన తర్వాత రాజమౌళి రాశి కన్నాను చూసి చాలా క్యూట్‌గా చాలా అందంగా ఉంది ఏదైనా లవ్ స్టోరీకి ఏమే బాగా సెట్ అవుతుంది అంటూ చెప్పాడట రాజమౌళి.
అంతే కాదు నా స్నేహితుడు మంచి ప్రేమ కథ పై పని చేస్తున్నాడు ఒకసారి ఆ కథ విను నీకు తప్పకుండా నచ్చుతుంది అంటూ రాజమౌళి రాశి కన్నా కూడా చెప్పారట. ఇక అలా ఊహలు గుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైంది రాశిఖన్నా .ఈ సినిమాలో హీరోయిన్గా నటించినప్పటికీ రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా చేసి ఉంటే బావుంటుంది అని చెప్పుకొచ్చింది రాశి కన్నా. ఇక ప్రస్తుతం సర్దార్ 2 అనే తమిళ మూవీ తో పాటు బాలీవుడ్ లో యోధ అనే సినిమాలో కూడా నటిస్తూ బిజీగా ఉంది రాశిఖన్నా..!!