సమంత గూర్చి ఆసక్తికర వ్యాఖ్య చేసిన మంచు లక్ష్మి....!!
ప్రేమించిన వ్యక్తిని పెళ్ళాడి అతనితో మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకోవడం భయంకరమైన వ్యాధులు తనని చుట్టుముట్టడం వంటి సమస్యలతో సమంత పోరాడుతూ ధైర్యంగా నిలబడ్డారు.
ఐతే ఈ క్రమంలోనే నటి మంచు లక్ష్మీ సైతం సమంత ధైర్య సాహసాల గురించి సమంత పట్ల ప్రశంసలకు కురిపిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.మోహన్ బాబు వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి నటించిన అగ్ని నక్షత్రం సినిమా నుంచి తెలుసా తెలుసా అనే పాటను సమంత చేతుల మీదుగా విడుదల చేశారు. ఇది ఉమెన్ ఎంపవర్మెంట్ కు సంబంధించినది కావడంతో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా సమంతతో తనకు ఉన్నటువంటి అనుబంధం గురించి మంచు లక్ష్మి మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. సమంత వ్యక్తిత్వానికి ప్రతిరూపం.. ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలుగా తాము ఇలాగే ఉండాలి.. సమంతతో పాటు ఆమె అనుభవించిన కష్టాలు వాటిని ఎదుర్కొన్న తీరు తనకు తెలుసు.ఇక సమంత స్థానంలో మరెవరున్నా కూడా నలిగిపోయేవారు ఎంతో క్లిష్ట పరిస్థితులలో కూడా సమంత ధైర్యం కోల్పోకుండా తనని తాను మలుచుకున్న తీరు ఎందరికో స్ఫూర్తి అంటూ సమంత గురించి మంచు లక్ష్మి చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇకవంశీకృష్ణ డైరెక్షన్లో వస్తున్నటువంటి అగ్ని నక్షత్రం మూవీ కు మంచు లక్ష్మీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఈమె కూతురుతో పాటు తన తండ్రి కూడా కలిసి నటించడం విశేషం.
ఐతే సమంత అన్నింటి పరంగా తన బాధలు అలాగే కష్టాలు దూరమై మునుపటి లాగా వరుస సినిమాలతో దూసుకు పోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.