ఒకప్పటి స్టార్ హీరోయిన్ మహేశ్వరి ఇప్పుడు ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు..!?

Anilkumar
తెలుగు సినీ ప్రేక్షకులకు మహేశ్వరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు తమిళ కన్నడ భాషల్లో సుమారు 35 సినిమాలకు పైగానే నటించిన ఈమె తన నటనతో ఎంతోమంది హృదయాలను గెలుచుకుంది .మహేశ్వరి 1995లో అమ్మాయి కాపురం అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది ఈమె. దాని అనంతరం గులాబీ సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది .దాని అనంతరం పెళ్లి సినిమాతో మంచి గుర్తింపు పొందింది. తర్వాత నీకోసం ప్రియరాగాలు మా బాలాజీ లాంటి సినిమాలతో స్టార్ హీరోయిన్ లిస్టులోకి చేరిపోయింది మహేశ్వరి. 

90 స్ లో  తెలుగు స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది ఈమె .ఇక అలా స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలో ఒక్కసారిగా ఎవరు ఊహించిన విధంగా సినిమాలకు దూరమైంది. ఈమె తమిళంలో అజాద్ విగ్రహం లాంటి హీరోల సరసన నటించిన ఈమె  దాని అనంతరం 2012లో జీ తెలుగులో మై నేమ్ ఇస్ మంగతాయారు అనే సీరియల్ లో కూడా నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే ఇక తెలుగులో మహేశ్వరి చివరిగా తిరుమల తిరుపతి వెంకటేశ అనే సినిమాలో నటించింది. అనంతరం 2008లో జయకృష్ణ అనే బిజినెస్ మాన్ ని పెళ్లి చేసుకుంది.

ఇకపోతే మహేశ్వరి అతిలోకసుందరి శ్రీదేవికి కజిన్ సిస్టర్ అన్న సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది .అయితే అప్పటినుండి ఇప్పటివరకు ఫ్యాన్స్ కు సోషల్ మీడియాకి దూరంగానే ఉంటుంది. తాజాగా తన కుటుంబానికి సంబంధించిన కొన్ని ఫోటోలు నూతన అభిమానులతో తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తుంది ఈమె .మహేశ్వరి ప్రస్తుతం జాన్వీ కపూర్ కు తోడుగా ఉంటుంది .దాంతోపాటు సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించేందుకు మహేశ్వరి ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది .చాలా ఏళ్ల తర్వాత మహేశ్వరి తన కుటుంబానికి మరియు తనకి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకోవడంతో ఆ ఫోటోలు కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: