స్టార్ హీరో కమలహాసన్ కూతురు శృతిహాసన్ సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో సంవత్సరాలు అవుతోంది. స్టార్ ఇమేజ్ ని వాడుకొని ఇండస్ట్రీలోకి మాత్రం ఎంట్రీ ఇవ్వలేదు ఈ ముద్దుగుమ్మ. కేవలం స్వతంత్రంగానే ఉండేందుకు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటుంది. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఇక ఈ సమయంలోనే అందాల ఆరబోత విషయంలో కూడా ఇతర హీరోయిన్లను మించిపోయి చూపిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హాట్ హాట్ ఫోటో షూట్లతో కొంటెగా దిగిన కొన్ని సెల్ఫీలను తన బాయ్ ఫ్రెండ్ తో దిగినటువంటి ఫోటోలను సైతం సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది.
శృతిహాసన్ తాజాగా చీరలో మెరిసిపోయే అందాలను ప్రదర్శిస్తోంది .చాలావరకు ట్రెండి వేర్లో పొట్టి దుస్తులలో తన అందాలను చూపిస్తూ ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చీరలో మైమరిపించేలా చేస్తోంది. శృతిహాసన్ లేటెస్ట్ సిల్క్ చీరలు మెరిసిపోతూ ఎర్రని కొంగు కలిగిన ఆకుపచ్చ చీరలో హోయలు పలుకుతూ అందాలను చూపిస్తోంది. ఈ ముద్దుగుమ్మ ఫోటోలు అభిమానులు తెగ వైరల్ గా చేస్తున్నారు. స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం వరుస విజయాలను అందుకుంటుంది ఈ ఏడాది సంక్రాంతికి తన హవా కొనసాగించింది.
శృతిహాసన్ నటించిన తెలుగు సినిమాలన్నీ వరుసగా విజయాలు అందుకుంటున్నాయి. కెరియర్ బిగినింగ్ అనగనగా ఒక ధీరుడు, ఓ మై ఫ్రెండ్, రామయ్య వస్తావయ్య వంటి చిత్రాలు ఈమె కెరియర్ లో డిజాస్టర్ గా మిగిలాయి కానీ గబ్బర్ సింగ్ ,బలుపు రేసుగుర్రం, ఎవడు ,శ్రీమంతుడు తదితర చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి.
అయితే ఆ తర్వాత కాస్త గ్యాప్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ క్రాక్ సినిమాతో మళ్లీ సక్సెస్‌ను అందుకుంది పవన్‌తో వకీల్ సాబ్ సినిమాలో నటించి పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ప్రభాస్‌తో సలార్ సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.