' సీ.ఈ.ఓ ' గా రానున్న రాంచరణ్... నిజమేనా...!!
ఒక స్టార్ హీరోతో సోషల్ మెసేజ్ మూవీ తీసి సక్సెస్ అవ్వచ్చని నిరూపించిన దర్శకుడు శంకర్. చెప్పాలంటే ఇండియన్ సినిమాకు భారీతనం, కొత్త సాంకేతికత పరిచయం చేసినవాళ్లలో ఒకరు. అందుకే శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ మూవీ అనగానే అంచనాలు ఏర్పడ్డాయి.
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తన బ్యానర్ లో 50వ చిత్రంగా నిర్మిస్తున్నారు. ఖర్చుకు వెనకాడకుండా భారీగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఆర్సీ 15 బడ్జెట్ పరిమితులు దాటేసిందంటున్నారు. కాగా ఆర్సీ-15 కథ ఇదేనంటూ ఓ ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఇది రివేంజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న సోషల్ మెసేజ్ మూవీ అట. పొలిటికల్ లీడర్ అయిన తండ్రి ఎన్నికల్లో జరిగిన అవకతవకల కారణంగా ఓటమి పాలవుతారు. ప్రత్యర్థులు అక్రమంగా ఆయన్ని ఓడించి కుటుంబాన్ని నాశనం చేస్తారట.
ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల వ్యవస్థలో వేళ్లూనుకుపోయిన అవినీతిని ఎదుర్కొనేందుకు కొడుకు రంగంలో దిగుతాడు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకుంటాడు. తన తండ్రి రాజకీయ జీవితాన్ని, తమ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసిన రాజకీయ నాయకులపై ఎన్నికల అధికారిగా రివేంజ్ తీర్చుకుంటాడు. ఎన్నికల వ్యవస్థలో ఉన్న దుర్మార్గులకు చెక్ పెడతాడు. శంకర్-రామ్ చరణ్ చిత్ర స్టోరీ లైన్ ఇదే అంటూ ప్రముఖంగా వినిపిస్తోంది. లీకైన ఫోటోలు దీన్ని బలపరిచే విధంగా ఉన్నాయి. పీరియాడిక్ ఎపిసోడ్స్ లో రామ్ చరణ్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నారు. అభ్యుదయ పార్టీ అధినేతగా రామ్ చరణ్ ఉన్నారు. ఇక టైటిల్ కూడా 'సీ ఈ ఓ'గా నిర్ణయించారంటున్నారు. మరి ఈ పుకార్లలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే... మూవీ విడుదల కావాల్సిందే.
రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నారు. పీరియాడిక్ ఎపిసోడ్స్ కి సంబంధించిన ఫోటోలు లీక్ అయ్యాయి. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. అంజలి, సునీల్ కీలక రోల్స్ చేస్తున్నారు. ఐతే వచ్చే సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా విడుదల కానుందంటున్నారు.దీనికి సంబంధించి దిల్ రాజు అనుకున్న దానికంటే బడ్జెట్ బాగా పెరిగి పోతుందని తెగ ఫీల్ అవుతున్నారు.