పెళ్లి అయ్యి విడాకులైన స్టార్ హీరోతో ప్రేమలో పడ్డ సార్ సినిమా హీరోయిన్..!?

Anilkumar
చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంయుక్త మీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేరళ లో జన్మించిన ఈమె మలయాళం లో తన సినీ కెరియర్ను మొదలుపెట్టింది చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది .మలయాళం లో దాదాపుగా ఈమె డజనుకు పైగాని సినిమాలలో నటించింది. 2022లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రానా దగ్గుబాటి హీరోలుగా అన్నటించిన మల్టీ స్టార్లర్ సినిమా భీమ్లా నాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది సంయుక్త మీనన్. తొలి సినిమాతోనే బ్లాక్బస్టర్ హిట్టును అందుకుంది ఈమె. దాని తరం కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన సినిమాలో కూడా కనిపించింది ఈమె.

 ఇకపోతే గత ఏడాది విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగులో సంయుక్త మీనన్ నటించిన మూడవ సినిమా సార్. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది వరుస విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో సంయుక్త మీనన్ టాలీవుడ్ లోనే లక్కీ బ్యూటీగా కూడా మంచి పేరును తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె సాయి ధరంతేజ్ కి జోడిగా విరూపాక్ష సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది .త్వరలోనే ఈ సినిమా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఇక ఈ విషయం పక్కన పెడితే సంయుక్త మీనన్కు సంబంధించిన

 ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. ఇక అదేంటి అంటే ఈ స్టార్ హీరోయిన్ ఒక స్టార్ హీరోతో ప్రేమలో పడిందని అంటున్నారు. ఆల్రెడీ పెళ్లయిన ఒక స్టార్ హీరోతో ఈమె ప్రేమలో పడిందట పెళ్లి విడాకులు కూడా ఆ స్టార్ హీరోకి అయ్యాయని తెలుస్తుంది. ఇక స్టార్ హీరో మరెవరో కాదు ధనుష్. కొద్ది నెలల క్రితమే ధనుష్ తన భార్యతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. దాని అనంతరం సంయుక్త కి మనసిచ్చాడట. ధనుష్ సార్ సినిమాతో తొలిసారిగా ధనుష్ తో సంయుక్త మీనన్ ఒకే స్క్రీన్ పై మెరిస్తారు. ఇక ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ఇప్పుడు ప్రేమగా మారిందని అంటున్నారు. అంతేకాదు ధనుష్ ను రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సంయుక్త మీనన్ సుదమైనట్లుగా కూడా అంటున్నారు. ఇక ఈ విషయం తెలిసిన అనంతరం అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: