పవన్ అభిమానులకు శుభవార్త తెలిపిన ఉస్తాద్ టీమ్..!
ఈ కాంబినేషన్ మీద ప్రస్తుతం అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే అభిమానులకు శుభవార్త తెలుపుతూ ఏప్రిల్ 5వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని సమాచారం. ప్రస్తుతం పవన్ ,సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సీతం రీమేక్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే . ఇందులో ఆయన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకి ఆయన కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారు. ఆ 20 రోజులకు గానూ భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు సమాచారం.
ఇకపోతే ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఉస్తాద్ సినిమాకి షిఫ్ట్ అవుతున్నాడు పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ సినిమాకు సంబంధించిన ఒకటి రెండు షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసి.. ఆ తర్వాత సుజిత్ తో వస్తున్న ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సినిమాను మొదలు పెట్టబోతున్నారు. ఇలా ప్రస్తుతం ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరొకవైపు తాను ఫినిష్ చేయాలనుకున్న సినిమాలను కూడా ఆయన త్వరలోనే కంప్లీట్ చేయనున్నట్లు సమాచారం. ఇకపోతే ఈ సినిమాల ద్వారా వచ్చేటప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలను కోసం రెచ్చిస్తున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.