వైరల్ అవుతున్న శృతి హాసన్ జిమ్ వర్క్ ఔట్ వీడియో...!!
ఇప్పటికే తన మోకాలికి గాయమైనట్టుగా శృతి హాసన్ ప్రకటించిన దగ్గరి నుంచి ఆ ఫోటోలను షేర్ చేస్తూ రెండు వారాలుగా బాగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు శృతిహాసన్ షూట్ చేసిన వీడియో కూడా తెగ వైరల్ గా మారింది. ప్రస్తుతం శృతి హాసన్ మళ్లీ వర్కౌట్లతో బిజీ బిజీగా మారింది. వర్కౌట్ కి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ " చాలా రోజుల తరువాత మళ్లీ స్టార్ట్ చేశా,తన పిచ్చిని అలాగే తన బలాన్ని భరిస్తాడు" అంటూ తన ట్రైనర్ గురించి శృతి హాసన్ చెప్పుకొచ్చింది. ఇక ఈ వీడియోలో శృతి హాసన్ పిచ్చి పిచ్చిగా చేసిన విన్యాసాలు చూస్తే కచ్చితంగా అయితే నవ్వు వస్తుంది. ఇక శృతిహాసన్ సినిమాల విషయానికి క్రాక్ సినిమా ద్వారా మంచి కం బ్యాక్ ఇచ్చిన శృ తి హాసన్ కు ఈ ఏడాది బాగానే కలిసి వచ్చేలా అయితే ఉంది. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటించి రెండు హిట్లను తన ఖాతాలో అయితే వేసుకుంది. చిరంజీవి వాల్తేరు వీరయ్య అలాగే బాలయ్య వీర సింహా రెడ్డి వంటి శృతిహాసన్ నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలై సంక్రాంతి మంచి హిట్లుగా నిలిచాయి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ "సలార్" సినిమాలో కూడా నటిస్తోందని సమాచారం.. ఈ సినిమా కూడా ఈ ఏడాది విడుదల కానున్న విషయం తెలిసిందే.