మెగాస్టార్
చిరంజీవి ఈ సంవత్సరం
సంక్రాంతి కానుకగా
జనవరి 13 వ తేదీన విడుదలైన వాల్టేర్ వీరయ్య
మూవీ తో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
బ్లాక్ బస్టర్ మూవీ లో
శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... బాబి ఈ
మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ క్రేజీ
మూవీ కి రాక్ స్టార్ దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దేవి
శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా ఈ
మూవీ విజయంలో కీలక పాత్రను పోషించింది.
ఈ సంస్థ కొన్ని రోజుల క్రితం నుండి వాల్టేర్ వీరయ్య సినిమాను తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా
నెట్ ఫ్లిక్స్ సంస్థ వారు తమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ వారంలో టాప్ టెన్ లో నిలిచిన సినిమాల లిస్ట్ ను విడుదల చేసింది. ఈ లిస్ట్ లో వాల్టేర్ వీరయ్య
సినిమా ప్రధమ స్థానంలో నిలిచింది.
థియేటర్ లలో భారీ
బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ
సినిమా "ఓ టి టి" లో కూడా అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది.