టాలీవుడ్లో కీర్తి సురేష్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా హోమ్లీ బ్యూటీగా పేరు పొందడమే కాకుండా గ్లామర్ ఇమేజ్ తో కూడా కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. కీర్తి సురేష్ తనకు తిరుగులేదని నిరూపించుకుంది. మహానటి సినిమాతో తన నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓన్లీ ఫ్యామిలీ ఆడియన్స్ సైతం మెప్పిస్తే అవసరమైన చోట మాత్రమే గ్లామర్ ఓలకబోస్తూ ఉంటుంది. నేను శైలజ సినిమాతో మొదటిసారిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పలు చిత్రాలలో నటించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించింది.
ఈ ముద్దుగుమ్మ ఎక్కువగా గ్లామర్ షో చేయలేదు. నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలలోని నటిస్తూ ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్ ఫోటోలు మైండ్ బ్లోయింగ్ చేసే విధంగా కనిపిస్తున్నాయి బ్లాక్ శారీలో తన అందాలతో మెస్మరైజ్ చేస్తోంది . నాజూ కైనా నడుముతో చిన్న చిరునవ్వుతో ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు అభిమానులు కామేత్త చేస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్ నానితో కలిసి దసరా సినిమాలో నటిస్తున్నది ఈ చిత్రం మాస్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా ఈ నెల 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.
ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగానే కీర్తి సురేష్ ఇలా బ్లాక్ శారీలో వయ్యారాలు వలకబోస్తూ మైమరిపిస్తోంది. చీర కట్టులో కీర్తి సురేష్ ను ఇలా చూడడానికి రెండు కళ్ళు సరిపోవటం లేదంటే అభిమానులు తెలియజేస్తున్నారు. దసరా సినిమాలో కూడా కీర్తి సురేష్ విభిన్నమైన గ్లామర్ రోల్స్ లో కనిపించబోతోంది. ఇక ఈ చిత్రమే కాకుండా చిరంజీవి నటిస్తున్న భోళా శంకర్ చిత్రంలో కూడా చిరంజీవికి చెల్లెలు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కీర్తి సురేష్ ని బ్లాక్ శారీలో చూస్తే ఇక అంతే అని చెప్పవచ్చు.