మాస్ మహారాజా
రవితేజ ప్రస్తుతం రావణాసుర అనే
మూవీ లో
హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ
మూవీ లో
సుశాంత్ ఒక కీలకమైన పాత్రలో కనిపించనుండగా ...
మేఘ ఆకాష్ , ఫరీయ అబ్దుల్లా , అను ఇమాన్యుయల్ ,
పూజిత పొన్నాడ , ద్రాక్ష నాగర్కర్ లు ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ
మూవీ కి హర్ష వర్ధన్ రామేశ్వర్ ...
భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తున్నారు.
ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసింది. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ టీజర్ లో
రవితేజ నెగిటివ్ షేడ్స్ ఉన్నా పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే
రవితేజ డ్రెస్సింగ్ స్టైల్ ... డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ టీజర్ కు అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్
యూట్యూబ్ లో లభించింది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ
సినిమా బృందం ఈ
మూవీ ప్రమోషన్ లపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా ఈ
మూవీ కి సంబంధించిన మొదటి సాంగ్ ప్రోమో కు సంబంధించిన విడుదల తేదీని తాజాగా ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ
మూవీ లోని "వేయినొక్క" అనే సాంగ్ ప్రోమో ను ఈ రోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. రావణాసుర
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.