టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో అవసరాల శ్రీనివాస్ ఒకరు. ఈ దర్శకుడు కెరీర్ ప్రారంభంలో కొన్ని సినిమాల్లో నటుడి గా నటించి ... ఆ తర్వాత దర్శకుడిగా సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నాడు. అందులో భాగంగా ఈ దర్శకుడు నాగ శౌర్య హీరో గా రాశి కన్నా హీరోయిన్ గా రూపొందిన ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టి ... మొదటి మూవీ తోనే మంచి విజయాన్ని అందుకొని దర్శకుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరచుకున్నాడు.
ఆ తర్వాత అవసరాల శ్రీనివాస్ సినిమాల్లో నటిస్తూనే వీలు చిక్కినప్పుడల్లా మూవీ లకు దర్శకత్వం వహిస్తూ తన కెరియర్ ను నటుడి గా ... దర్శకుడు గా మంచి జోష్ లో ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే అవసరాల శ్రీనివాస్ తాజాగా నాగ శౌర్య హీరో గా మాళవిక నాయర్ హీరోయిన్ గా రూపొందిన పాలన అబ్బాయి పలానా అమ్మాయి అనే మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని మార్చి 17 వ తేదీన థియేటర్.లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం అనేక ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి తాజాగా మరో పాటకు సంబంధించిన విడుదల తేదీని ప్రకటించింది. ఈ మూవీ నుండి కాఫీఫి అనే సాంగ్ ను ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.