చరిత్ర సృష్టిస్తున్న కాంతారా చిత్రం..!!
ఇందులో హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అజిత్ కుమార్ ,సప్తమి గౌడ ,ప్రమోద్ శెట్టి అందరూ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు. హోంబలే ఫిలిం బ్యానర్ మీద ఈ సినిమాని నిర్మించారు విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో కూడా కలెక్షన్ల పరంగా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. ఈ సినిమా సీక్వెల్ నిర్మించ పనులలో చిత్ర బృందం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది జూన్ నెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్లు సమాచారం.
కాంతారా సినిమా అంతర్జాతీయ గుర్తింపు సాధించింది దీనిని ఏకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించబోతున్నట్లు తెలుస్తోంది. స్విజర్లాండ్ జెనీవాలో ఉన్న యూరప్ దేశాల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో రేపటి రోజున ఈ సినిమా స్ట్రిమింగ్ కాబోతోంది. ఇప్పటికే కాంతారా హీరో డైరెక్టర్ రిషబ్ శెట్టి జేనివాకు చేరుకున్నారు. ఐరాసాలో ప్రదర్శించబోతున్న మొదటి కనడ చిత్రం ఇదేనట. అడవులు, పర్యావరణ పరిరక్షణ అడవి ప్రాంతాలపై ఆధారపడిన కొంతమంది గిరిజనుల ఆదివాసుల సమస్యల పైన ఈ సినిమాని తెరకెక్కించారు రిషబ్ శెట్టి. ఐక్యరాజ్యసమితిని ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్నట్లుగా తెలుస్తోంది.ఈ సినిమా కథ కూడా యూనివర్సిటీ కావడంతో అందులో ఉండే ప్రతినిధులు దీనిని అధికారికంగా స్క్రీనింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.