NTR -30 లో విలన్ గా ఆ స్టార్ హీరో..?

frame NTR -30 లో విలన్ గా ఆ స్టార్ హీరో..?

Divya
ఎన్టీఆర్ ,డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ntr -30 వ చిత్రం ఎట్టకేలకు ఈ నెలాఖరున సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఈ సినిమా మార్చి 23న పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి మార్చి 30న రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని నెలలుగా ntr -30 చాలా ఆలస్యంగా అవుతోంది. ఈ సినిమాలలో హీరోయిన్ గా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. ఇక మిగిలింది కేవలం ఈ సినిమాలోని విలన్ రోలే. బాలీవుడ్ లో టాప్ హీరోని సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం.

షూటింగ్ మొదట గత ఏడాది వేసవి లో ప్రారంభించాలని ప్లాన్ చేశారు. అప్పటినుంచి ఈ సినిమా నిరంతరం వాయిదా పడుతూనే వస్తోంది. సినిమా షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదలు పెట్టాలనుకున్నారు. అలాగే ఈ సినిమాని విడుదల తేదీ వచ్చే ఏడాది ఏప్రిల్ కు ఫిక్స్ చేయడం జరిగింది. ఇప్పుడు కొరటాల శివ  చిత్ర బృందం ఎట్టకేలకు మార్చి టైం లైన్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో తెలుగుతోపాటు హిందీలో కూడా విడుదల చేయబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాని కూడా భారీ అంచనాలు మధ్య తెరకెక్కిస్తున్నారు కొరటా శివ. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తూ ఉండగా విలన్ గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోసం చిత్ర బృందం కూడా సంప్రదించారని సమాచారం. తనకు స్టోరీ నచ్చి ఈ సినిమాని ఓకే చేసినట్లు తెలుస్తున్నది. ntr -30 లో విలన్ రోల్ గురించి అతి త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం ఎన్టీఆర్ కొరటాల శివ లాస్ట్ ఇయర్ ఒక వీడియోతో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. సంగీతం అనిరుద్ అందిస్తూ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: