కమల్ హాసన్ కు ఆస్కార్ రాకపోవడానికి కారణం అదేనా...?
ఇక చాలా మందితో పాటు కమలహాసన్ కూడా దశావతారం వంటి సినిమాకు ఆస్కార్ లభించాల్సి ఉండేది అని కూడా అనుకున్నవారే. ఈ సినిమాలో భాష బేధం, జాతి బేధం, వృత్తి బేధం, లింగ బేధం, అలాగే దేశ భేదం అనే విషయాలు అన్నీ కూడా కనిపించేలా పది పాత్రలను సెలెక్ట్ చేసుకుని ఆ అన్ని పాత్రలకు కూడా సరైన న్యాయం చేశాడని చెప్పొచ్చు.ఆ సినిమాలో అద్భుతంగా నటించాడు కమల్ హాసన్. అయినా కూడా ఈ చిత్రం కనీసం ఇండియా నుంచి ఆస్కార్ లిస్టులో కూడా వెళ్లలేదు. అంతకు ముందు కూడా అనేక సినిమాలు ఆస్కార్ కి కమలహాసన్ దరఖాస్తు చేసుకున్నా కానీ రకరకాల కారణాలతో విఫలమవుతూ వస్తున్నారు. ఎందుకంటే ఆస్కార్ గెలవాలంటే టాలెంట్ మాత్రమే ఉంటే చాలదు.డబ్బు ఖర్చు కూడా చేయాలనే విషయం ఇప్పుడు రాజమౌళిని చూసిన తర్వాతనే తెలిసింది.
కమల్ హాసన్ తన సినిమా జీవితంలో చేసిన ప్రయోగాలు మరొక నటుడు చేయలేదని చెప్పాలి.తన జీవితంలో 19 ఫిలింఫేర్ అవార్డులు రాగా ఐదు జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. తన సొంత భాషా తమిళం అయినప్పటికీ కూడా తెలుగు, హిందీ మరియు మలయాళ భాషల్లో ఎన్నో అవార్డులు పొందాడు .ఇక చాలామందికి తెలియని సంగతి ఏమిటి అంటే ఫిలింఫేర్ అవార్డులు ఇకపై నాకు ఎలాంటివి ఇవ్వద్దు అంటూ కూడా సదరు అసోసియేషన్ వారికి లేఖను కూడా కమల్ రాసారని సమాచారం.