నాచురల్ స్టార్
నాని తాజా గా ఊర
మాస్ మూవీ అయినటు వంటి
దసరా లో
హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
సినిమా లో
నాని అదిరిపోయే
రా అండ్ రష్టిక్ పాత్రలో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. ఇప్పటికే ఈ
సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన
పోస్టర్ లు ... టీజర్ ... పాటలు ... ట్రైలర్ లలో
నాని అదిరిపోయే ఊర
మాస్ లుక్ పాత్రలో ప్రేక్షకులను అలరించాడు. ఈ
మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ...
కీర్తి సురేష్ ఈ సినిమాలో
నాని సరసన
హీరోయిన్ గా నటించింది .
ఈ
మూవీ ని
మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు తో పాటు
కన్నడ ,
తమిళ్ ,
హిందీ , మలయాళ భాష ల్లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ భాషలకు సంబంధించిన ట్రైలర్ లను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది . ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ
సినిమా నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడం తో ఈ
మూవీ పై భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. మరి ఈ
మూవీ ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుంటుందో తెలియాలి అంటే
మార్చి 30 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.