మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. 'RC15' నుండి డబుల్ సర్ప్రైజ్..?

Anilkumar
ప్రస్తుతం మెగా ఫ్యాన్స్ అంత ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది 'RC15' అని చెప్పొచ్చు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనా నెలకొన్నాయి. ప్రస్తుతం 80 శాతానికి పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా శంకర్ మార్క్ హంగులతో తెరకెక్కుతోంది. భారీ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాదులో జరుగుతోంది. ఇక ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న ఈ మూవీ టైటిల్ కు సంబంధించి పలు అప్డేట్స్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా రాబోతున్నాయని ఇప్పటికే వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. 

అయితే తాజా సమాచారం ప్రకారం 'RC15' నుంచి ఫ్యాన్స్ కి డబుల్ సర్ప్రైజ్ రాబోతున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం మార్చి 27 రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ముందు మూవీ టైటిల్ ని అనౌన్స్ చేస్తారని ఇప్పటికే దిల్ రాజు కన్ఫర్మ్ చేశారు. అయితే ఇప్పుడు అదే రోజు మరో బిగ్ ట్రీట్ కూడా ఉండబోతుందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. దర్శకుడు శంకర్ ఈ మూవీ టైటిల్ తో పాటుగా స్పెషల్ వీడియో కూడా రామ్ చరణ్ పై రిలీజ్ చేయబోతున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి రెండు బ్లాస్ట్ లాంటి అప్డేట్స్ రావడం దాదాపు కన్ఫామ్ అయిపోయిందని సమాచారం.

ఇంతకీ దర్శకుడు శంకర్ రెడీ చేస్తున్న స్పెషల్ వీడియో ఏంటి? అందులో ఏముంటుంది? అని ఈ న్యూస్ తెలిసిన ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే టైటిల్ విషయంలో ఈ సినిమాకి 'CEO' అనే టైటిల్ ని మూవీ టీం పరిశీలనలో పెట్టినట్లు తెలుస్తోంది. దర్శకుడు శంకర్ దాదాపు ఇదే టైటిల్ని ఫైనల్ చేసే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, నవీన్ చంద్ర, అంజలి, సునీల్, జయరామ్, ఎస్ జె సూర్య తదితరులు ఇతర కీలకపాత్రలు పోషిస్తున్నారు. 2024 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: