టాలీవుడ్
ఇండస్ట్రీ లోకి దర్శకుడు గా ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి
మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని మంచి గుర్తింపు ను సంపాదించుకున్న అతి కొద్ది మంది దర్శకుల లో వెంకి కుడుముల ఒకరు . ఈ దర్శకుడు నాగ శౌర్య
హీరో గా
రష్మిక మందన
హీరోయిన్ గా రూపొందిన
ఛలో మూవీ తో దర్శకుడుగా తన కెరియర్ ను మొదలు పెట్టాడు . ఈ
మూవీ మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడి కి తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ లభించింది .
ఇప్పటికే నితిన్ కు
వెంకీ ఒక కథను వినిపించగా ... ఆ కథ బాగా నచ్చిన నితిన్ వెంటనే
వెంకీ దర్శకత్వంలో మూవీ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ కాంబినేషన్ కు సంబంధించిన
మూవీ ని ప్రస్తుతం
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న మైత్రి
మూవీ సంస్థ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం.