నాచురల్ స్టార్
నాని ఆఖరుగా అంటే సుందరానికి
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ
సినిమా విడుదలకు ముందు ఈ
మూవీ నుండి విడుదల చేసిన ప్రచార చిత్రాలు ... పాటలు ప్రేక్షకులను ఎంత గానో ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలు నడుమ విడుదల ఈ
సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దానితో
నాని అంటే సుందరానికి
మూవీ తో ప్రేక్షకులను కాస్త నిరోత్సాహపరచాడు. ఇది ఇలా ఉంటే తాజాగా
నాని "దసరా" అనే
మూవీ లో
హీరో గా నటించాడు.
ఈ
మూవీ ని
మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ ని వరల్డ్ వైడ్ గా తెలుగు ,
తమిళ , మలయాళ ,
హిందీ ,
కన్నడ భాషలలో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ
మూవీ తో
శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టనున్నాడు. ఈ సినిమాలో
కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే
నాని ...
కీర్తి సురేష్ కాంబినేషన్ లో
నేను లోకల్ మూవీ రూపొందింది. ఇది వీరిద్దరి కాంబినేషన్ లో రెండవ సినిమా.
సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ నుండి చిత్ర బృందం ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ
మూవీ ని యూఎస్ఏ లో ప్రత్యంగిరా సినిమాస్ సంస్థ వారు విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సంస్థ ఈ సినిమాను యుఎస్ఏ లో 600 ప్లస్ లొకేషన్ లలో కేవలం తెలుగు భాషలోనే స్క్రీనింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే ఇప్పటి వరకు ఇండియాలో మూడవ హైయెస్ట్ స్క్రీనింగ్ సినిమాగా
దసరా యూఎస్ఏ లో విడుదల కాబోతున్నట్లు కూడా ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను
మార్చి 29 వ తేదీనే యూఎస్ఏ లో ప్రీమియర్స్ వేయనున్నట్లు ప్రత్యాంగిరా సంస్థ తాజాగా ప్రకటించింది.