ఇండియా లోనే గ్రేట్
డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
ఇండియా లోనే గ్రేట్
డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మణిరత్నం తాజాగా పొన్నియన్ సెల్వన్ పార్ట్ 2
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఈ
మూవీ యొక్క మొదటి భాగం
తమిళ్ , తెలుగు ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయ్యి పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఈ
మూవీ లో చియాన్
విక్రమ్ , కార్తీ ,
జయం రవి ,
ఐశ్వర్య రాయ్ ,
త్రిష , శోభితా
ధూళిపాల కీలక పాత్రలలో నటించగా , ఏ ఆర్ రెహమాన్ ఈ
మూవీ కి సంగీతం అందించాడు.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ యొక్క మొదటి భాగం మంచి విజయం సాధించడంతో ఈ
సినిమా రెండవ భాగం పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ రెండవ భాగాన్ని 28 ఏప్రిల్ 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ
మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా నుండి "ఆగనందే" అనే మొదటి పాట విడుదల తేదీని మరియు సమయాన్ని ప్రకటించింది.
ఈ
మూవీ లోని మొదటి పాటను
మార్చి 20 వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ
పోస్టర్ లో కార్తీ మరియు
త్రిష లు ఉన్నారు. ఈ
పోస్టర్ లో కార్తీ కళ్ళకు గంతలు కట్టి ఉండగా ...
త్రిష చేతిలో ఒక పొడవాటి
కత్తి ఉంది. ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.