కన్నడ
సినిమా ఇండస్ట్రీ నుండి పోయిన సంవత్సరం కాంతారా అనే
మూవీ విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాంతారా
మూవీ మొదట
కన్నడ భాషలో విడుదలయి సూపర్
సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ
మూవీ ని మరి కొన్ని భాషల్లో విడుదల చేశారు. అందులో భాగంగా ఈ సినిమాను తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యి అదిరిపోయే రేంజ్ టాక్ ను తెచ్చుకొని
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సూపర్
సక్సెస్ ను అందుకుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ ని మరి కొన్ని రోజుల్లో స్పానిష్ మరియు ఇటాలియన్ విదేశీ భాషల్లో అయితే థియేట్రికల్ గా రిలీజ్ చేయబోతున్నట్టుగా ఈ
మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అజనీష్ లోకనాథ్ సంగీతం అందించిన ఈ
మూవీ ని హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.