యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి
మూవీ ని వెరీ టాలెంటెడ్
డైరెక్టర్ కొరటాల
శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 30 వ
మూవీ గా రూపొందబోతుంది. కొంత కాలం క్రితమే ఈ
మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. అలాగే ఈ
మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను మరియు మోషన్ టీజర్ ను కూడా విడుదల చేసింది.
వీటికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. కొంత కాలం క్రితమే ఈ
మూవీ లో
జూనియర్ ఎన్టీఆర్ సరసన
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్
హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది. అలాగే ఈ
మూవీ బృందం ఈ
సినిమా యొక్క లాంచింగ్ ను
మార్చి 23 వ తేదీన అధికారికంగా చేయబోతున్నట్లు కూడా ప్రకటించింది. అందులో భాగంగా ప్రస్తుతం ఈ
మూవీ యూనిట్ ఈ
మూవీ లాంచింగ్ ను
అన్నపూర్ణ స్టూడియోస్ లో చేయాలా లేక నోవేటల్ లో చేయాల అనే విషయంపై చర్చలు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రాబోతున్నట్లు సమాచారం.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ లాంచింగ్ వేడుకకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ లాంచింగ్ వేడుకకు
బాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు అయినటు వంటి
సైఫ్ అలీ ఖాన్ ముఖ్య అతిథిగా విచ్చేసి అవకాశాలు ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.