టాలీవుడ్
కోలీవుడ్ లో నెంబర్ 1 స్టార్
హీరోయిన్ గా దూసుకుపోయిన
అనుష్క కొత్త హీరోయిన్ల రాకతో పూర్తిగా వెనకబడిపోయింది. ఇక చాలా కాలం తరువాత ఆమె చేస్తోన్న లేటెస్ట్
మూవీ మిస్ శెట్టి..
మిస్టర్ పోలిశెట్టి. యంగ్
హీరో నవీన్ పోలిశెట్టి ఈ మూవీలో నటిస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ
సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కుతోంది.రీసెంట్ గానే ఈ
మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. ఇంకా అలాగే ఫస్ట్ లుక్
పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఇందులో వీరిద్దరి లుక్స్ అయితే చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి.
అనుష్క కెరీర్ లో 48వ సినిమాగా రాబోతున్న ఈ మూవీని
ప్రభాస్ సన్నిహితులు వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి యంగ్
డైరెక్టర్ మహేష్ బాబు దర్శకత్వం వహిస్తుండగా ఇంకా రథన్ సంగీతం అందిస్తున్నారు.తాజాగా ఉగాది
పండుగ సందర్భంగా ఈ
సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
పెళ్లి తర్వాత
అమ్మాయి లైఫ్ లో ఉన్న కష్టాలని చెబుతూ ఈ సాంగ్ విడుదల అయ్యింది.అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీని సమ్మర్ కానుకగా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.అయితే ప్రస్తుతం
మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.ఇక
అనుష్క వెండితెరపై కనిపించి దాదాపు రెండున్నరేళ్లు దాటింది. ఆమె చివరగా కనిపించిన
మూవీ నిశ్సబ్దం.
2020 అక్టోబర్ 2 వ తేదీన నేరుగా ఓటీటీలో విడుదలైంది ఈ సినిమా. మిస్టరీ జానర్ లో వచ్చిన ఈ మూవీలో
అనుష్క మూగ, చెవిటి అమ్మాయిగా నటించి ఆకట్టుకుంది. ఇక ఈ
సినిమా తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న
అనుష్క ఇప్పుడు మిస్ శెట్టి
మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటిస్తున్నారు.ఇక ఈ సినిమాతో
అనుష్క మళ్ళీ తన మునుపటి ఫామ్ ని దక్కించుకుంటుందో లేదో చూడాలి.