శాకుంతలం సినిమా మొదటి ఛాయస్ ఆ హీరోనే.. కానీ..?
శాకుంతలం సినిమాలో దుష్యంతుడి పాత్రను మొదటి అనుకొన్నది దేవి మోహన్ ని కాదట.. హీరో దుల్కర్ సల్మాన్ ని అనుకోక .. అయితే అప్పటికే దుల్కర్ సల్మాన్ సీతారామం సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి డేట్లు ఖాళీగా లేకపోవడంతో ఈ సినిమాకు నో చెప్పారట. కానీ ఈ పాత్ర కోసం తెలుగు హీరోలను ఎంపిక చేయకపోవడానికి ముఖ్య కారణం టాలీవుడ్ హీరోలు ఎవరు ఈ పాత్రలో నటించడానికి ముందుకు రాలేదని తెలియజేశారు గుణశేఖర్.
అందువల్లే ఎవరిని కూడా ఈ పాత్ర కోసం బలవంతం చేయలేదని ఒక మలయాళం నటుడిని తీసుకున్నట్లు తెలియజేశారు. గత ఏడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని సాంకేతిక కారణాల వల్ల పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఇప్పటికి ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం ఏప్రిల్ 14న పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కాబోతున్నది.నీలిమ గుణశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే అల్లు అర్హ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతాన్ని అందించారు సాయి మాధవ్ బుర్ర రచన సహకారం అందించడం జరిగింది. ఈ సినిమా కోసం సమంత అభిమానులు కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.