"సలార్" మూవీ షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా కేవలం అన్ని రోజులే..?

frame "సలార్" మూవీ షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా కేవలం అన్ని రోజులే..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ మూవీ లో శృతి హాసన్ ... ప్రభాస్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... జగపతి బాబు ... పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మూవీ లో కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ కి రవి బుస్రుర్ సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే మొదట ఈ మూవీ ని ఈ  చిత్ర బృందం పాన్ ఇండియా మూవీ గా విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. కాక పోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ఇంగ్లీషు లో కూడా విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం సన్నహాలు చేస్తున్నట్లు ... త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే చాలా భాగం పూర్తయినట్లు తెలుస్తోంది.

తాజాగా ఈ మూవీ షూటింగ్ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ఇంకా కేవలం 15 నుండి 20 రోజులు మాత్రమే పెండింగ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. మరో 15 నుండి 20 రోజుల్లో ఈ మూవీ షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్లు ... ఆ తర్వాత ఈ మూవీ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ మూవీ యూనిట్ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: