"బలగం" మూవీ మూడు వారాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

frame "బలగం" మూవీ మూడు వారాల్లో సాధించిన కలెక్షన్ల వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
కొన్ని సినిమాలు భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి భారీ కలక్షన్ లను వసూలు చేస్తూ ఉంటాయి. కానీ మరి కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మౌత్ టాక్ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధిస్తూ బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటూ ఉంటాయి. అలా ఈ మధ్య కాలంలో ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మౌత్ టాక్ తో అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను సాధించి భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా బలగం.

ఈ మూవీ లో ప్రియదర్శి హీరో గా నటించగా ... కావ్య కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. కమెడియన్ వేణు ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయ్యి ప్రేక్షకుల దగ్గర నుండి సూపర్ పాజిటివ్ టాక్ ను తెచ్చుకొని అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఈ రోజు నుండి అమెజాన్ ప్రైమ్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ ఇప్పటి వరకు మూడు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ మూడు వారాల్లో ఈ సినిమా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసిందో తెలుసుకుందాం. మొదటి వారం ఈ సినిమా 7 కోట్ల ప్లేస్ కలెక్షన్ లను వసూలు చేయగా  ...  రెండో వారం 8 కోట్ల ప్లేస్ కలెక్షన్ లను వసూలు చేసింది. మూడో వారం 7 కోట్ల ప్లేస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా మూడు వారాలు కూడా ఈ మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: