మాస్ మహారాజా
రవితేజ ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య
మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించాడు. ఈ
మూవీ లో
రవితేజ పాత్ర నిడివి తక్కువే ఉన్నప్పటికీ ఈ పాత్రతో ప్రేక్షకులను
రవితేజ ఎంత గానో ఆకట్టుకున్నాడు. వాల్టేర్ వీరయ్య
మూవీ లో
రవితేజ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. బాబి కొల్లి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించగా
శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం వాల్టేరు వీరయ్య
మూవీ తో ప్రేక్షకులను అలరించిన
రవితేజ మరి కొన్ని రోజుల్లో రావణాసుర
మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. తాజాగా ఈ
మూవీ యూనిట్ ఈ
సినిమా ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించింది. ఈ
మూవీ యొక్క ట్రైలర్ ను
మార్చి 28 వ తేదీన సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక
పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్త బృందం తాజాగా విడుదల చేసిన ఈ
పోస్టర్ లో
రవితేజ అదిరిపోయే స్టైలిష్ లుక్ లో నిలబడి ఉన్నాడు.
రవితేజ వెనక భారీ మంటలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ
పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.