తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటు వంటి
సుధీర్ వర్మ తాజాగా రావణాసుర అనే
మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ లో
మాస్ మహారాజా
రవితేజ హీరో గా నటించాడు. అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో
సుశాంత్ నటించగా ... మరి కొన్ని ముఖ్య పాత్రలలో అను ఇమాన్యుయల్ , పరియా అబ్దుల్లా ,
మేఘ ఆకాష్ , దాక్షా నాగర్కర్ ,
పూజిత పన్నోడ లు నటించారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని ఏప్రిల్ 7 వ తేదీన విడుదల చేయనున్నారు.
ఈ
మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ
సినిమా బృందం టీజర్ ను విడుదల చేసింది.
రవితేజ డైలాగ్ డెలివరీ అలాగే
సుశాంత్ పాత్ర కూడా బాగుండడంతో ఈ
మూవీ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. అలాగే ఈ
సినిమా బృందం ఈ
సినిమా నుండి కొన్ని పాటలను కూడా విడుదల చేయగా వాటికి కూడా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
సినిమా దర్శకుడు అయినటు వంటి
సుధీర్ వర్మ ఈ
మూవీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా
సుధీర్ వర్మ "రావణాసుర"
మూవీ గురించి మాట్లాడుతూ ... ఈ
మూవీ అసలు ఎలాంటి సినిమాకి కూడా
రీమేక్ కాదని ... ఇది కేవలం
రవితేజ గారిని దృష్టిలో పెట్టుకొని రాసుకున్న కంప్లీట్ న్యూ స్టోరీ అని ఈ దర్శకుడు కన్ఫామ్ చేశాడు. రామేశ్వర్ మరియు భీమ్స్ సంగీతం అందించిన ఈ
మూవీ ని
అభిషేక్ పిక్చర్స్ వారు నిర్మించారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ
మూవీ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.