ఈ క్రమంలో తాజాగా సోమవారం నాడు ఈ
సినిమా టైటిల్
పోస్టర్ రిలీజ్ చేస్తూ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.హిందీలో కూడా ఒరిజినల్ టైటిల్ కొనసాగిస్తున్నారు మేకర్స్. వేసవి కానుకగా ఈ ను మే 12 వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు
మూవీ యూనిట్ ప్రకటించింది. ఫస్ట్ లుక్
పోస్టర్ లో
బెల్లంకొండ శ్రీనివాస్ కండలు తిరిగిన బాడీతో చేతిలో చెంబు పట్టుకుని సముద్రం వైపు తిరిగి కనిపిస్తున్నారు. అయితే అలా ఈ
పోస్టర్ రిలీజ్ అయ్యిందో లేదో
బాలీవుడ్ అభిమానుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. ఈ
సినిమా రిలీజ్ అయ్యి అక్కడ పెద్ద హిట్ అయితే ఇక నో డౌట్
శ్రీనివాస్ కూడా పెద్ద స్టార్
హీరో అవ్వడం ఖాయం. ఇక ఈ సినిమాను పెన్ స్టూడియోస్ బ్యానర్ పై
జయంతి లాల్ నిర్మిస్తున్నారు.మరీ ఈ సినిమాతో హిందీలో
బెల్లంకొండ శ్రీనివాస్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి. అయితే ఈ సినిమాలో నటించిన
హీరోయిన్ ఎవరనేది ఇప్పటికీ క్లారిటీ రాలేదు. ఇంకా అలాగే ఇందులో నటించే నటీనటుల గురించి కూడా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.