షాక్.. సంగీత దర్శకుడు కీరవాణి కి కరోనా పాజిటివ్..?

Divya
ఈ మధ్యనే తెలుగు రాష్ట్రం గర్వపడేలా తెలుగు సినీ ఇండస్ట్రీని ప్రపంచ దేశాలకు పరిచయం చేశారు ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి. అలాగే ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్ rrr సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కారుడు వచ్చేలా చేశారు. ఈ పాటకి ఆస్కార్ అవార్డు రావడం కోసం rrr చిత్ర బృందం చాలా డబ్బులు ఖర్చు పెట్టి ప్రమోషన్స్ కూడా నిర్వహించింది. ఇక చివరి వరకు ఆస్కార్ వస్తుందని నమ్మకం వారిలో లేదు కానీ ఎలాగైనా వస్తుందని గట్టి నమ్మకంతో ఈ ప్రయత్నం చేశారు.
అనుకున్నట్టుగానే rrr చిత్రానికి నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. ఈ వేదికపై కీరవాణి, చంద్రబోస్ గారు ఇద్దరు ఈ ఆస్కార్ అవార్డులను అందుకున్నారు.  ఇటీవలే rrr చిత్ర బృందం మొత్తం ఇండియాకి చేరుకోవడం జరిగింది.. ఇలాంటి సమయంలోనే కీరవాణి హాస్పిటల్ బెడ్ పైన పడుకున్నటువంటి కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ఇక అసలు విషయంలోకి వెళ్తే ఆస్కార్ ప్రమోషన్స్ కోసం ఇప్పటికే చాలా చోట్లకు. rrr చిత్ర బృందం తిరిగింది.
దీంతో కీరవాణి కూడా పలుచోట్లకి తిరగడం జరిగింది అలా ఇండియాకు వచ్చిన ఆయనకు అస్వస్థగా అనిపించడంతో స్వయంగా వెళ్లి కరోనా టెస్ట్ చేయించుకున్నారట.  కరోనా పాజిటివ్ అని రావడంతో ఆయన ఆస్పటల్ లో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఇప్పటివరకు తెలుగు మీడియా ఛానల్స్ లో ఇంకా బయట పెట్టలేదు.. కానీ కీరవాణి ఆయనే ఈ విషయాన్ని ఒక హిందీ మీడియా సంస్థతో చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంపై హిందీ మీడియాలో పలు కథనాలు వినిపిస్తూ ఉన్నాయి.  ఈ విషయం తెలిసి చాలా మంది నెటిజన్స్ కీరవాణి త్వరగా  కోలుకోవాలని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: