పాన్ ఇండియా రేంజ్ లో గ్యాంగ్ స్టర్ గా పవన్ విశ్వరూపం..!
ఏది ఏమైనా సెప్టెంబర్ కల్లా ఈ సినిమా రిలీజ్ ఉంటుందని టాక్. మరోపక్క హరి హర వీరమల్లు సినిమాను కూడా దసరాకి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హరీష్ శంకర్ సినిమా ఏప్రిల్ లో షూటింగ్ జరుపుకోనుంది. ఇక సుజిత్ తో చేస్తున్న సినిమాకి కూడా మే నెల మొత్తం కేటాయించాడట పవన్ కళ్యాణ్. ఇదిలాఉంటే సుజిత్ డైరెక్షన్ లో పవన్ చేస్తున్న సినిమాకు టైటిల్ ఫిక్స్ చేసినట్టు టాక్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ఫైనల్ చేశారట.
ఆ టైటిల్ నే దానయ్య తన ప్రొడక్షన్ లో రిజిస్టర్ చేశారని తెలుస్తుంది. అంతేకాదు ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. పవన్ హరి హర వీరమల్లు సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అనుకున్నారు. ఆ సినిమా లేట్ అవుతుంది. ఇప్పుడు సుజిత్ సినిమా కూడా ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు. పవన్ సినిమా నేషనల్ వైజ్ గా రిలీజ్ చేస్తే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క. మొత్తానికి పవన్ తన సినిమాల వేగం పెంచి ఫ్యాన్స్ ని ఖుషి అయ్యేలా చేస్తున్నాడు. సుజిత్ ఓజీలో పవన్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవలేదు.