మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటిమనులలో ఒకరు అయినటువంటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ "అ ఆ" మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ తర్వాత అనేక సినిమాలలో అవకాశాలను దక్కించుకొని అందులో తన నటన తో ... అంద చందాలతో ఎంతో మంది ప్రేక్షకుల మనసును దోచుకుని ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ ముద్దుగుమ్మ రౌడీ బాయ్స్ ... అంటే సుందరానికి ... కార్తికేయ 2 ... 18 పేజెస్ మూవీ లలో నటించింది. ఈ మూవీ లలో అంటే సుందరానికి మూవీ లో ఈ ముద్దుగుమ్మ ఒక కీలకమైన పాత్రలో నటించింది. మిగతా మూవీ లలో హీరోయిన్ గా నటించింది. ఇది ఇలా ఉంటే కెరియర్ లో నటించిన సినిమాల్లో రౌడీ బాయ్స్ సినిమాలో తప్పితే మిగతా సినిమాలన్నింటిలో కూడా ఈ ముద్దుగుమ్మ చాలా పద్ధతి గానే నటించింది. కానీ రౌడీ బాయ్స్ సినిమాలో మాత్రం ముద్దు సన్నివేశాలలో నటించింది.
ఇది ఇలా ఉంటే ఈ మధ్య అనుపమ సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను ఎక్కువగా పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో అనుపమ అదిరిపోయే లుక్ లో ఉన్న శారీని కట్టుకొని ... స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి సైడ్ వ్యూ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అనుపమ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.