తెలుగు
సినిమా ఇండస్ట్రీలో సూపర్ క్రేజ్ ఉన్న
నాని తాజాగా
దసరా అనే సినిమాలో
హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాని రేపు అనగా
మార్చి 30 వ తేదీన వరల్డ్ వైడ్ గా తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ సినిమాని ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 2710
థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ...
మహానటి కీర్తి సురేష్ ఈ
మూవీ లో
నాని సరసన రెండవ సారి
హీరోయిన్ గా నటించింది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో
నేను లోకల్ అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్
మూవీ రూపొందింది. కమర్షియల్ కథతో రూపొందిన ఆ
మూవీ అద్భుతమైన విజయాన్ని
బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది.
దసరా
మూవీ ని దర్శకుడు సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు.
నాని ఈ
మూవీ లో అదిరిపోయే ఊర
మాస్ లుక్ లో కనిపించబోతున్నాడు. అలాగే
కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో డి గ్లామరైసేడ్ రోల్ లో కనిపించబోతుంది. ఈ
మూవీ లో నాచురల్ స్టార్
నాని ఊర
మాస్ లుక్ లో కనిపించనుండడం ... కీర్తి
సురేష్ డి గ్లామరైసేడ్ రోల్ లో కనిపించనుండడం తో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాకి ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా అడ్వాన్స్ బుకింగ్ ల ద్వారా అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు వస్తున్నట్లు తెలుస్తోంది. ఒక వేళ ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి
బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే 1 వ రోజు ఈ
మూవీ కి అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు ఉన్నాయి.