దసరా సినిమాతో నెంబర్ వన్ స్థానంలో నాని..!!
మొదటి సినిమాతోనే దర్శకుడితో హ్యూమన్ ఓపెనింగ్స్ సాధించగలిగిన నటుడుగా పేరు పొందారు నాని అయితే ఇతర భాషలలో ఇలాంటివి సాధించడం చాలా కష్టమని చెప్పవచ్చు. కేవలం మన టాలీవుడ్ హీరోలకు మాత్రమే సాధ్యమవుతుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. దసరా సినిమాతో నాని టైర్ -2 హీరోలలో ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన హీరోగా మొదటి స్థానంలో పేరు పొందినట్లు తెలుస్తోంది. నాని కెరియర్ లోనే ఇప్పటివరకు ఈ విధంగా కలెక్షన్లు వచ్చిన దాఖలు లేవు. ప్రస్తుతం నాని దసరా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి సురేష్ నటించింది.
దసరా సినిమా విడుదలైన వారం రోజుల్లోనే నాని కెరియర్ లోనే బెస్ట్ షేర్ రావడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు నాని ఈ సినిమాతో ఎలాంటి రికార్డులను సైతం క్రియేట్ చేస్తారు చూడాలి మరి. దాని తల తదుపరి చిత్రాన్ని కూడా అప్పుడే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు ఇందులో హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. ఏది ఏమైనా నాని దసరా సినిమాతో ఒకేసారి పాన్ ఇండియా లెవెల్ లో తన హవా కొనసాగించాలని చెప్పవచ్చు. ఈ ఫామ్ నీ ఇలాగే కంటిన్యూ చేస్తారేమో చూడాలి.