బింబిసార
మూవీ తో సూపర్
సక్సెస్ ను అందుకున్న
కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం కొంత కాలం క్రితమే ఏమిగిస్ అనే
మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బింబిసారా
మూవీ తర్వాత
కళ్యాణ్ రామ్ నటించిన
మూవీ కావడంతో ఈ
మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ
మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోవడంలో నిరాశ పరిచిన ఈ
మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
ఈ
మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను
నెట్ ఫ్లిక్స్ డిజిటల్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ
మూవీ ని ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 1 వ తేదీ నుండి
నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ
మూవీ కి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. రాజేంద్ర
రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ
మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... ఆశకా
రంగనాథ్ ఈ
మూవీ లో
హీరోయిన్ గా నటించింది.