తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ ఉన్న యువ హీరోలలో సిద్దు జొన్నలగడ్డ ఒకరు. ఈ యువ హీరో కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో నటించాడు. కానీ ఆ మూవీ లు పెద్దగా ఈ హీరోకు గుర్తింపు తెచ్చి పెట్ట లేదు. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం ఈ యువ హీరో డీజే టిల్లు అనే మూవీ లో హీరో గా నటించాడు. నేహా శెట్టి ఈ సినిమాలో సిద్దు సరసన హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన పాటలు ... ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టు కునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. అలాగే భారీ లాభాలను కూడా సాధించింది. ఇలా డీజే టిల్లు మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ప్రస్తుతం సిద్దు ఈ మూవీ కి సీక్వల్ గా టిల్లు స్క్వేర్ అనే టైటిల్ తో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది.
ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగం షూటింగ్ కూడా పూర్తి అయింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 11 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ మూవీ యూనిట్ ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం మరి కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.