'ఆర్ ఆర్ ఆర్' ను చూసి హాలీవుడ్ డైరెక్టర్లు నేర్చుకోవాలి: బ్రిటన్ నటుడు జేమీ హ్యారీస్

Anilkumar
టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన త్రిబుల్ ఆర్ మూవీ ఎంతటి సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రం కూడా అందుకోలేని అవార్డ్స్ ని ఈ మూవీ కైవసం చేసుకుంది. ఈ సినిమా విడుదలై ఏడాదిపైనే కావస్తున్న ఇంకా సినిమా క్రేజ్ మాత్రం అస్సలు తగ్గలేదు. ఇటీవల ఆస్కార్ అవార్డు సైతం అందుకొని తెలుగు సినీ పరిశ్రమలోని సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక ముఖ్యంగా సౌత్, నార్త్ ప్రేక్షకులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ని ఈ మూవీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా హాలీవుడ్ ఆడియన్స్ ని సైతం మెస్మరైజ్ చేసింది. 

ఈ సినిమా గురించి చాలామంది హాలీవుడ్ ప్రముఖులు మాట్లాడుతూ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఆస్కార్ తో పాటు మరికొన్ని అవార్డులను సొంతం చేసుకున్న త్రిబుల్ ఆర్ చిత్రం పై తాజాగా బ్రిటన్ నటుడు జేమి హ్యారీస్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఆర్ ఆర్ ఆర్ గురించి జెమీ హ్యారీస్ మాట్లాడుతూ..'ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎంతో బాగుందని.. దర్శకులు రాజమౌళి ఈ సినిమాని అత్యంత అద్భుతంగా రూపొందించారని.. తారక్, చరణ్ ఇద్దరు కూడా సినిమాలో సమానంగా నటించి ఈ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారని అన్నారు. త్రిబుల్ ఆర్ లాంటి సినిమాను హాలీవుడ్లో సైతం తీయడానికి ప్రముఖ దర్శకులు సిద్ధమవుతున్నారని..

అన్ని రకాల అంశాలను కలిపి ఒక సినిమాగా రూపొందించడం అది అత్యంత కష్టమైన పని అని.. ఈ విషయాన్ని రాజమౌళి చేసి చూపించారు. ఈ సినిమాను చూసి హాలీవుడ్ దర్శకులు సైతం ఎంతో నేర్చుకోవాల్సి ఉందంటూ' చెప్పుకొచ్చారు. దీంతో ఆర్ ఆర్ ఆర్ గురించి జెమీ హ్యారీస్ చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం తెగ వైరల్ గా మారుతున్నాయి. ఇక త్రిబుల్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ పనులు జరుగుతుండగా.. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో అడ్వెంచర్స్ డ్రామాగా హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: