కవల పిల్లల పేర్లు రివీల్ చేసిన నయనతార.. ఏంటో తెలుసా?
ఎంతోమందితో ప్రేమాయణాన్ని నడిపిన నయనతార చివరికి తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. అతనితో కూడా ఎన్నో ఏళ్ల పాటు ప్రేమలో మునిగి తేలిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంటుందా లేదా అని అనుమానాన్ని అందరిలో కలిగించింది. కానీ చివరికి పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలిగా మారిపోయింది అని చెప్పాలి. అయితే నయనతార పెళ్లయిన నాలుగు నెలలకే ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది. ఏకంగా నాలుగు నెలలకే సరోగసి పద్ధతి ద్వారా ఏకంగా కవల పిల్లలకు తల్లిగా మారిపోయింది నయనతార.
దీంతో ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు అని చెప్పాలి. అయితే నయనతార, విగ్నేష్ శివన్ ఎక్కడికి వెళ్లినా కవల పిల్లలను చేతిలో ఎత్తుకొని కెమెరా కంట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అంతేకాదు ఇప్పటివరకు ఇక నయనతార కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఏంటి అన్న విషయం కూడా ఎవరికీ తెలియదు అని చెప్పాలి. అయితే ఇక కవల పిల్లల పేర్లు ఏంటి అన్న విషయాన్ని స్వయంగా నయనతార, విగ్నేష్ శివన్ జంట రివీల్ చేసింది అని చెప్పాలి. పెద్ద కొడుకు పేరు ఉయుర్ రుద్రోనీల్ ఎన్ శివన్ గా నామకరణం చేశారట. ఇక రెండో కొడుకుకి ఉలగ్ దైవిక్ ఎన్ శివన్ గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. ఇక వీరి పేరు మధ్యలో ఉన్న ఈ ఎన్ అనే పదానికి నయన్ అనే అర్థం వస్తుంది అని విగ్నేష్ శివన్ చెప్పుకొచ్చాడు.