కాజల్ తెలివితేటలకు షాక్ లో బాలీవుడ్ !

Seetha Sailaja
కాజల్ అగ్రవాల్ పెళ్ళి చేసుకుని ఒక బిడ్డకు తల్లి అయిన తరువాత కూడ తన ఫిజిక్ ను కంట్రోల్ లో పెట్టుకుని యూటర్న్ తీసుకుని తిరిగి సినిమాలలో నటించడానికి రెడీ అయింది. తనకు ఎంతో గుర్తింపు తెచ్చిన టాలీవుడ్ ఇండస్ట్రీ పై మళ్ళీ దృష్టి పెట్టి ఇక్కడ అవకాశాల కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. అయితే ఈసెకండ్ ఇన్నింగ్స్ లో కూడ ఆమె తన పారితోషికాన్ని ఏమాత్రం తగ్గించకుండా తన రేంజ్ ని కొనసాగిస్తోంది.



ప్రస్తుతం ఆమె బాలకృష్ణ పక్కన అనీల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తోంది. సీనియర్ హీరోలకు హీరోయిన్ సమస్య ఎదురౌతూ ఉండటంతో కాజల్ దానికి పరిష్కారంగా మారింది అన్న కామెంట్స్ ఉన్నాయి. లేటెస్ట్ గా ఆమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలీవుడ్ టాలీవుడ్ ల మధ్య గల తేడాను వివరిస్తూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసింది.



‘హిందీ నా మాతృభాష బాలీవుడ్ సినిమాలు చూస్తూ పెరిగాను బాలీవుడ్ చాలా మంచి ఇండస్ట్రీ. నాకు కొన్ని అవకాశాలు కూడా ఇచ్చింది. అయితే దక్షిణాది సినీ పరిశ్రమలో ఉన్న సినీ వాతావరణం విలువలు క్రమశిక్షణకు నేను ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ బాలీవుడ్ లో ఈ క్వాలిటీస్ లేవు’ అంటూ కామెంట్స్ చేసింది. వాస్తవానికి దక్షిణాదిలో పేరు సంపాదించుకున్న రష్మిక పూజా హెగ్డే లు బాలీవుడ్ లో స్థిర పడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనికి భిన్నంగా కాజల్ మాత్రం తనకు ఇప్పటికీ టాలీవుడ్ మాత్రమే తన ప్రాధాన్యత అంటూ ఇక్కడి ఇండస్ట్రీని బుట్టలో వేసుకోవడానికి మళ్ళీ ప్రయత్నిస్తోంది.


‘నేను ముంబాయి అమ్మాయిని. కాకపోతే నా కెరీర్ టాలీవుడ్ లో మొదలైంది. నేను ఎక్కువగా తెలుగు తమిళ సినిమాలే చేశాను. కొన్ని హిందీ సినిమాలు చేశాను. హైదరాబాద్ చెన్నైలో ఉన్నప్పుడు నాకు హోమ్ ఫీలింగ్ కలుగుతుంది’ అంటూ ఆమె చేస్తున్న కామెంట్స్ చాల వ్యూహాత్మకంగా ఉన్నాయి అనిపిస్తోంది. ఆమె భర్తతో కలిసి కాజల్ వ్యాపారంలో కూడ అడుగు పెట్టి తన వ్యాపారాన్ని దక్షిణాది నగరాలలో కూడ విస్తరించడానికి కాజల్ చాల తెలివిగా అడుగులు వేస్తోంది..    



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: