సమంతతో విడాకుల తర్వాత.. నాగచైతన్య నిజంగా అలా చేశాడా?
కానీ ఆ తర్వాత ఒక్కసారిగా విడాకులు తీసుకుంటున్నాము అంటూ ఇద్దరు ప్రకటించడంతో అటు అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యంలో మునిగిపోయారు. సమంత నాగచైతన్య ఏంటి.. విడాకులు తీసుకోవడం ఏంటి.. అంత ప్రేమ ఉన్న వీరు ఇద్దరు విడాకులు తీసుకోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారు. అసలు ఏం జరిగింది అన్న విషయం మాత్రం ఇప్పటికి ప్రేక్షకులకు తెలియని ఒక మిస్టరీగానే మిగిలిపోయింది అని చెప్పాలి. గతంలో ఒక షోలో పాల్గొన్న సమయంలో నాగచైతన్యను నన్ను ఒక్క రూమ్ లో ఉంచితే పదునైన కత్తులు లాంటిది రూమ్లో ఉండకూడదు అంటూ నాగచైతన్య పై కోపాన్ని బయటపెట్టింది.
ఇక విడాకుల విషయంలో అసలు తప్పు ఎవరిది అన్నది ఇక సోషల్ మీడియాలో వార్తల్లో చూడటం తప్ప ఎవరికీ అసలు నిజం మాత్రం తెలియదు. అయితే ఇటీవల ఇక నాగచైతన్య గురించి ఒక షాకింగ్ విషయం బయటపడింది. సాధారణంగానే నాగచైతన్య చాలా సిగ్గు బిడియం తో ఉంటాడు. ఎవరితో ఎక్కువగా కలవడు. అయితే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన సమంతతో విడాకులు తీసుకున్నాక నాగచైతన్య చాలా రోజులపాటు గదిలోనే కూర్చొని ఏడ్చాడట. సమంతతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకొని ఎంతగానో కృంగిపోయాడట. కుటుంబ సభ్యులు స్నేహితులు ఓదార్చిన కూడా బాధ నుంచి బయటపడలేదట. చివరికి జీవితంలో ఇలాంటివి ఎదుర్కోవాల్సిందే అని నిర్ణయించుకుని... మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఇక ఎప్పటిలాగే జీవితం గడపడం మొదలుపెట్టాడట.