సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆయన స్టార్ పవర్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించిన మహేష్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే మహేష్ నటించిన సినిమా విడుదల అయినప్పుడు హిట్ ... ఫ్లాప్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా మొదటి వారం రోజుల పాటు అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కుతూ ఉంటాయి. ఆ రేంజ్ క్రేజ్ కలిగిన మహేష్ మూవీ కి అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇది ఇలా అంటే ప్రస్తుతం మహేష్ ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ మూవీ లో శ్రీ లీల ... పూజా హెగ్డే హీరోయిన్ లుగా కనిపించనుండగా ... జయరామ్ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగానే ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ముగుస్తున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన ఓవర్సీస్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం గమనిస్తే నాన్ పాన్ ఇండియా మూవీ లలో మహేష్ 28 వ మూవీ కి ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాకు ఓవర్సీస్ ఏరియాలో జరగని రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.