NBK -108 మూవీని రిజెక్ట్ చేసిన త్రిష.. కారణం..?
గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి ఈ సినిమా అప్డేట్ వరుసగా విడుదల అవుతూనే ఉంది.. మొన్నటికి మొన్న శ్రీలీల బాలయ్య సినిమాలో నటించబోతున్నట్లు బాలయ్య హ్యాండ్ పట్టుకొని ఒక ఫోటోలు విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత కాజల్ అగర్వాల్ కూడా అదే స్టైల్ లో ఒక ఫోటోని విడుదల చేసింది. ఈ సినిమా విడుదల తేదీ పోస్టర్ను కూడా చిత్ర బృందం శ్రీరామనవమి పండుగ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఇక బాలయ్య అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా దసరా పండుగకి విడుదల కాబోతున్నది.
బాలయ్య ,అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న మొదటి చిత్రం కావడంతో ఈ సినిమా పూర్తిగా కామెడీ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే తెలంగాణ యాసకు సంబంధించి ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో ఈ సినిమాల హీరోయిన్ త్రిష నటించబోతోంది అంటూ వార్తలు వినిపించాయి.. వాస్తవానికి ఈ చిత్రంలో అతిధి పాత్ర కోసం హీరోయిన్ త్రిషను సంప్రదించినట్లు చిత్రం బృందం తెలుస్తోంది కానీ ఏమీ ఈ ఆఫర్లు తిరస్కరించినట్లు సమాచారం. కానీ త్రిష మాత్రం ఈ పాత్రను ఎందుకు తిరస్కరించిందో అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు..మరి ఈ అతిధి పాత్ర కోసం ఎవరిని తీసుకున్నారో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే.