జపాన్ లో "ఆర్ఆర్ఆర్" మూవీకి వస్తున్న రెస్పాన్స్ పై స్పందించిన రాజమౌళి..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రాజమౌళి ... జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన స్టూడెంట్ నెంబర్ 1 అనే మూవీ తో దర్శకుడి గా తన కెరీర్ ను మొదలు పెట్టాడు. ఈ మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని రాజమౌళి బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. ఇలా స్టూడెంట్ నెంబర్ 1 మూవీ తో దర్శకుడి గా కెరియర్ ను మొదలు పెట్టి మొట్ట మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అంతకు మించిన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ దర్శకుడు ఆ తర్వాత అనేక మూ వీలకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన ప్రతి మూవీ తోను అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా తన క్రేజ్ ను పెంచుకున్నాడు.


ఇది ఇలా ఉంటే రాజమౌళి ఆఖరుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ... యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ అనే మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసింది. పోయిన సంవత్సరం విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని కొంత కాలం క్రితమే ఈ చిత్ర బృందం జపాన్ లో విడుదల చేసింది. ఈ మూవీ జపాన్ లో భారీ అంచనాల నడుమ విడుదల అయింది. ఈ మూవీ ఇప్పటి వరకు జపాన్ లో అద్భుతమైన కలెక్షన్ లను కూడా రాబట్టింది.  


తాజాగా ఈ మూవీ జపాన్ లో ఒక అదిరిపోయే రికార్డును సాధించింది. లేటెస్ట్ గా ఈ సినిమా జపాన్ లో 1 మిలియన్ ఫుట్ ఫాల్స్ ని అందుకుంది. ఈ విషయంపై తాజాగా రాజమౌళి సోషల్ మీడియాగా స్పందిస్తూ ... 1 మిలియన్ ఫుట్ ఫాల్స్ ని జపాన్ లో ఆర్ ఆర్ ఆర్ అందుకున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తూ 1 మిలియన్ జపాన్ ఫ్యాన్స్ హగ్స్ లో అయితే తాము తమ హృదయం నిండిపోయింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: