పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన అక్కినేని హీరో..?

Anilkumar
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్.. ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. కాళిదాసు, కరెంట్, అడ్డా వంటి చిత్రాలతో పలు హిట్స్ అందుకున్నాడు. అయితే ఆ తర్వాత తను నటించిన సినిమాలన్నీ ఆశించిన ఫలితాల్ని అందించలేకపోయాయి. దాంతో ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడం సుశాంత్ కి చాలా కష్టతరంగా మారింది. ఈ క్రమంలోనే హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాడు. ఈ మేరకు అగ్ర హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తూ ముందుకు వెళ్తున్నాడు. ఇటీవల అల్లు అర్జున్ నటించిన అలవైకుంఠపురంలో సినిమాలో కీలక పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే. 

ఇక తాజాగా మాస్ మహారాజా రవితేజ నటించిన 'రావణాసుర' సినిమాలో కీ రోల్ ప్లే చేశాడు సుశాంత్. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 7న గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో సుశాంత్ కు పెళ్లికి సంబంధించి పలు ప్రశ్నలు ఎదురయ్యాయి. దానికి సుశాంత్ ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.ఈ మేరకు తాజా ఇంటర్వ్యూలో.. మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? అని యాంకర్ ప్రశ్నించగా.. అందుకు సుశాంత్ బదిలిస్తూ..' పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఉన్న దాని కంటే ఎక్కువ హ్యాపీగా ఉంటాను అనిపించాలి. అప్పుడే పెళ్లి చేసుకుంటా.

అలా అని పెళ్లి తర్వాత హ్యాపీగా ఉండరు అనేది నా ఒపీనియన్ కాదు. నాకు ఇంకా ఆ టైం రాలేదని అనుకుంటున్నా. ప్రస్తుతానికి నా ఫోకస్ అంతా సినిమాల మీద తప్ప పెళ్లి మీద లేదు' అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో సుశాంత్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. పెళ్లి మీద సుశాంత్ ఫుల్ క్లారిటీతో ఉన్నాడని ఈ సందర్భంగా నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఇక రావణాసురతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ సినిమాలో కూడా సుశాంత్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్ కి భర్తగా సుశాంత్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: