పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ... హరిష్
శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే
మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి
విజయ్ హీరోగా రూపొందిన తేరి అనే
తమిళ మూవీ కి అధికారిక
రీమేక్ గా రూపొందబోతుంది. ఈ
మూవీ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకుంది. ఈ
మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు.
తెలుగు లో కూడా ఈ
మూవీ కి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇలా ఇప్పటికే
తమిళ మరియు తెలుగు సినీ ప్రేమికులను అలరించిన ఈ
మూవీ ని పవన్
కళ్యాణ్ హీరోగా హరిష్
శంకర్ "ఉస్తాద్ భగత్ సింగ్" అనే టైటిల్ తో రూపొందించబోతున్నాడు. ఈ
మూవీ పేరుకు
రీమేక్ అయినప్పటికీ ఈ
మూవీ దర్శకుడు
హరీష్ శంకర్ ఈ
మూవీ కథ లోను ... స్క్రీన్ ప్లే లోను ... మరి చాలా విశాయలలోనూ చాలా మార్పులు ... చేర్పులు చేసినట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ఈ
మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్
పోస్టర్ ను కూడా ఈ చిత్ర బృందం ఇప్పటికే విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ యొక్క షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అలాగే ఈ
మూవీ షూటింగ్ లో మరికొన్ని రోజుల్లోనే పవన్
కళ్యాణ్ జాయిన్ కాబోతున్నట్లు సమాచారం. ఈ
మూవీ లో
శ్రీ లీల ... పవన్ సరసన
హీరోయిన్ గా నటించినుండగా ... దేవి
శ్రీ ప్రసాద్ ఈ
మూవీ కి సంగీతం అందించబోతున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ
మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు నిలకొని ఉన్నాయి.