రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస మూవీ లతో ఫుల్ బిజీగా ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ "ఆది పురుష్" మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్నాడు. అలాగే సలార్ మూవీ షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ లో ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ ఇంకా చాలా వరకు బ్యాలెన్స్ ఉంది.
ఇలా ప్రస్తుతం మూడు మూవీ ల షూటింగ్ లతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ చాలా రోజుల క్రితమే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీ ని ఓకే చేసిన విషయం మన అందరికీ తెలిసింది. ప్రస్తుతం సందీప్ ... రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా రూపొందుతున్నటు వంటి యనిమల్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి కాబోతోంది. ఈ మూవీ పూర్తి అయిన వెంటనే సందీప్ "స్పిరిట్" మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నవి అనుకున్నట్లు జరిగినట్లు అయితే ఈ సంవత్సరం ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ మూవీ ని సెట్స్ పైకి తీసుకెళ్లాలి అని ఈ మూవీ యూనిట్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే భారీ క్రేజ్ ఉన్నటు వంటి ప్రభాస్ ... సందీప్ కాంబినేషన్ లో రూపొందబోయే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ లెవెల్లో అంచనాలు నెలకొని ఉన్నాయి.