టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యంగ్ హీరో లలో నిఖిల్ ఒకరు . ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం నిఖిల్ రెండు మూవీ లతో ప్రేక్షకు లను పలకరించాడు . అందులో మొదటగా విడుదల అయినటు వంటి కార్తికేయ 2 మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకుంది . ఏకంగా ఈ మూవీ 100 కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టి నిఖిల్ కెరియర్ లోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ మూవీ ల లిస్ట్ లో చేరిపోయింది.
ఈ మూవీ కి చందు మొన్నేటి దర్శకత్వం వహించగా ... మోస్ట్ బ్యూటి ఫుల్ నటి అనుపమ పరమేశ్వరన్ ఈ మూవీ లో నిఖిల్ సరసన హీరోయిన్ గా నటించింది . ఇలా కార్తికేయ 2 మూవీ తో సూపర్ సక్సెస్ ను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న నిఖిల్ ఆ తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రూపొందినటు వంటి 18 పేజెస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది .
ఇది ఇలా ఉంటే కార్తికేయ 2 మూవీ తర్వాత నిఖిల్ ... అనుపమ నుండి రాబోతున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఈ మూవీ పై ప్రేక్షకులు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే జీ తెలుగు చానల్లో ప్రసారం చేయబోతున్నారు.