తమిళ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ప్రదీప్ రంగనాథన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ దర్శకుడు మరియు నటుడు తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించు కున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ప్రదీప్ రంగనాథన్ "లవ్ టుడే" అనే తమిళ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే ఆ మూవీ లో హీరో గా కూడా నటించాడు.
మొదట తమిళ్ లో విడుదల అయిన ఈ సినిమా తమిళ ప్రేక్షకులను సూపర్ గా అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. అలాగే అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. అలా తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తెలుగు లో ఆ తర్వాత విడుదల చేశారు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయం అందుకుంది.
ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించబోతుంది. ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు స్టార్ మా లో ప్రసారం కానుంది. ఏ జి ఎస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించిన ఈ మూవీ కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా ... ఇవాన ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకున్న ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.