తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడు గా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న వారిలో అల్లరి నరేష్ ఒకరు. ఈయన ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో విజయవంతమైన మూవీ లలో హీరోగా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే నరేష్ ఆఖరుగా మారేడు మిల్లి ప్రజానీకం అనే మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది.
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే మారేడుమిల్లి ప్రజానీకం మూవీ తర్వాత అల్లరి నరేష్ "ఉగ్రం" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించ బోతున్నాడు. విజయ్ కనకమెడల ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఇది వరకే నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో నాంది అనే మూవీ రూపొందింది. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడం మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను కూడా అందుకుంది. ఈ మూవీ లోని నరేష్ నటన కు గాను అద్భుతమైన ప్రశంసలు ఈ నటుడి కి దక్కాయి.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని మే 5 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఉగ్రం మూవీ తో నరేష్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.